ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంఘటనను గుర్తు చేసుకుంది. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన తన జీవితంలో, తన ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులు కారణమైందని వివరించింది మాన్వీ. ఓ నిర్మాతనుంచి తనకు వచ్చిన కాల్ గురించి సవివరంగా వివరించింది మాన్వీ. `ఏడాది క్రితం ఓ కొత్త నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. తనని తాను నిర్మాతగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, తాను తీయబోయే వెబ్ సిరీస్‌లో నన్ను నటించాల్సిందిగా కోరాడు.
వెంటనే తన బడ్జెట్ కూడా చెప్పాడు. అయితే ఆ బడ్జెట్ చాలా తక్కువని.. అయినా ముందు కథ నచ్చితే ఆ తరువాత పేమెంట్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పా. అతను మాత్రం బడ్జెట్ ఓకే అనుకుంటే కథ డిస్కస్ చేద్దాం అని చెప్పాడు. అయితే నేను ఆ పేమెంట్‌కు నటించను అని చెప్పాశా. కానీ వెంటనే ఆ నిర్మాతనా పేమెంట్‌ను మూడింతలు చేస్తానని అయితే అందుకు మరో విధంగా కాప్రమైజ్ కావాలని చెప్పాడు. నేను పోలీసులకు ఫోన్చేస్తానని బెదిరించటంతో అతను కాల్ కట్ చేశాడు. అంతే ఆ తరువాత నాకు తిరిగి కాల్ చేయలేదు` అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది మాన్వీ.
గత ఏడాది శుభ్‌మంగళ్ జ్యాదా సావదాన్ సినిమాలో నటించిన మాన్వీ గంగ్రూ, తరువాత ఉజ్డా చమన్‌లో కీలక పాత్రలో నటించింది.
]]>