Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305735

మేం బంధువులమే కాదు.. మంచి స్నేహితుల.. అవన్నీ పుకార్లు : మెగాస్టార్ చిరంజీవి

$
0
0
టాలీవుడ్లో పునాధిరాళ్లు సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టిన చిరంజీవిఅంచెలంచెలుగా మెగాస్టార్స్థాయికి పెరిగారు.  ఆయన సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సమయంలో అగ్ర హీరోల హవా కొనసాగుతుంది.  ఇదే సమయంలో చిరంజీవికి మంచి భవిష్యత్ ఉంటుందని భావించిన ప్రముఖ టాలీవుడ్కమెడియన్పద్మశ్రీఅల్లు రామలింగయ్యఅప్పడ్పుడే హీరోగా ఎదుగుతున్న చిరంజీవికి తన కూతరు సురేఖను ఇచ్చి వివాహం జరిపించారు.  అప్పటి నుంచి అల్లు వారి కుటుంబంతో అనుబంధం ఏర్పడింది.  అల్లు రామలింగయ్య తనయుడు ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న అల్లు అరవింద్కి మెగాస్టార్చిరంజీవికి ఈ మద్య అభిప్రాయ బేధాలు వచ్చాయని వార్తలు పుట్టుకొచ్చాయి.

చిరంజీవిరీ ఎంట్రీ తరువాత చరణ్సొంత బ్యానర్ పైనే ఆయన సినిమాలు నిర్మిస్తుండటం, గీతా ఆర్ట్స్వారికి అవకాశం ఇవ్వకపోవడం మనస్పర్థలను మరింత పెంచాయనే ప్రచారం జరుగుతోంది.  తాజాగా దీనిపై స్పందించిన మెగాస్టార్చిరంజీవిఇలాంటి వార్తలు అస్సలు నమ్మడానికి వీల్లేదని.. అల్లు ఫ్యామిలీతో తమకు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని అన్నారు.   అల్లు అరవింద్మా కుటుంబ సభ్యుడు. ఇద్దరం కూడా ఒకరి సలహాలు ఒకరం తీసుకుంటూ ఉంటాము. ముఖ్యమైన విషయాలను కలిసి చర్చించుకుంటూ ఉంటాము.



మా మధ్య విభేదాలు ఉన్నాయనడంలో ఎంతమాత్రం నిజం లేదు. మేమిద్దరం కలిసి పలు సినిమాల్లో కూడా నటించామని.. గతంలో కూడా పవన్తో అల్లు అరవింద్కి ఏదో గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు వింటుంటే అప్పుడప్పుడు మనసు బాధ కలుగుతుందని అన్నారు.  ఇలాంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను కూడా" అంటూ చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం చిరంజీవికొరటాలదర్శకత్వంలో ఆచార్య మూవీలో నటిస్తున్నారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305735

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>