ఇక సామాజిక దూరం అన్నది రేషన్ షాపుల వద్ద గాలిలో కలిసిపోతోంది. క్యూలో అదీ కూడా ఎలాంటి వసతుల్లేని దుకాణాల ఎదుట గంటల తరబడి... ఎండలో నిలబడాల్సిన పరిస్థితి నిరుపేదలకు ఎదురవుతోంది. ఇంత కష్టపడిన వారికి దక్కేది కేవలం బియ్యం మాత్రమే. మిగతా సరుకులకు మళ్లీ అప్పొసప్పో చేసి దుకాణాలకు వెళ్లాల్సిందే. లాక్‌డౌన్‌ను ప్రజలందరూ పాటించాలని చెబుతున్న ప్రభుత్వాలు..ప్రజలందరూ స్వచ్ఛదంగా పాటించేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై కొంతమంది నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విపత్తు మూలంగా రెండు రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ఎంత దారుణంగా వైఫల్యమైందో అర్థమవుతోంది.
పక్కనున్న కేరళను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందని మేధావులు గుర్తు చేస్తున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యవస్థ ప్రజాపంపిణీ వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 87 లక్షల కుటుంబాలకు అవసరమైన 17రకాల నిత్యవసరాలను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తిరిగి అందజేస్తున్నారు. బియ్యం, కిలో కందిపప్పు, కిలో పెసర పప్పు, పావుకిలో టీ పోడి, అరలీటరు కొబ్బరి నూనె, లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్, అర లీటర్ నువ్వుల నూనె, 100గ్రాముల పసుపు,100గ్రాముల కారం, 100గ్రాముల జిలకర్ర,100గ్రాముల ధనియాల పొడి, కిలో రవ్వ, కిలో మినుములు, ఆవాలు 100 గ్రాములు, రెండు సబ్బులు ఇలా ఓ కుటుంబానికి కావాల్సిన సరుకులను అందజేస్తుండటం గమనార్హం.
కేంద్రం అందజేసే సాయం కోసం ఎదురు చూడకుండానే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచే ఈ ఖర్చును భరిస్తోంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఐదేళ్లకోసారి వేలకోట్ల రూపాయలు జనంపైకి వెదజల్లడం కాదు..ఆపద సమయంలో ఇలాంటి మంచి నిర్ణయాలు..పాలనదక్షతతో వ్యవహరిస్తే జనం గుర్తుకు పెట్టుకుంటారని మేధావులు పేర్కొంటున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>