అయితే ఇంత కాలం వరకూ తీరిక లేకుండా ఉన్న సెలబ్రిటీలకు ఒక్కసారిగా చాలా తీరిక దొరకడంతో... ఎక్కువ సమయం ఏం చేయాలో అర్థం కాక సరికొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు తమకు తెలియని ఎన్నడూ చేయని పనులను కూడా చేస్తున్నారు చాలా మంది సెలబ్రెటీలు. కొత్త పనులను నేర్చుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తమకు నేర్చుకుంటున్న కొత్త పని గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. కత్రినా కైఫ్కూడా లాక్ డౌన్ సమయంలో రెస్ట్ తీసుకో కుండా బాగా కష్ట పడుతున్నారు..
మొన్నటికి మొన్న వంటగదిలో గిన్నెలు కడిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది కత్రినాకైఫ్. ఇక ఇప్పుడు చీపురు పట్టింది. తన గదిని కత్రినాస్వయంగా ఉడ్చేసింది. అయితే కత్రినాతన గదంతా చీపురు పడుతూ ఉడుస్తుంటే తన సోదరీ ఇసాబెల్లె కైఫ్ దీన్ని వీడియో తీసింది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియావేదికగా పోస్ట్ చేయడంతో... అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. లాక్ డౌన్ లో భాగంగా నా పని నేను చేసుకుంటున్నా... అంటూ కత్రినాకైఫ్ కామెంట్ పెట్టింది . ఈ క్రమంలోనే కొద్ది సేపు బ్యాట్ పట్టి క్రికెట్ఆడుతున్నట్లుగా చీపుర్లతో అటూ ఇటూ ఆడించింది కత్రినాకైఫ్. ఈ సందర్భంగా ఇంట్లో ఉండండి ప్రాణాలను రక్షించుకోండి అంటూ అందరికీ సూచించింది.
]]>