ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్లో అడుగు పెట్టే ప్రయత్నాలు బాలీవుడ్హీరోయిన్స్ఎక్కువగా చేస్తున్నారు. దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఇక్కడి సినిమాలు కమర్షియల్ గా వస్తున్నాయి కాబట్టి ఇక్కడి సినిమాలను బాలీవుడ్లో కూడా విడుదల చేస్తే అక్కడ తమ మార్కెట్పెరిగితే తమకు లాభం ఉంటుంది అనే భావనలో హీరోయిన్స్ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలుగు మీద బాలీవుడ్హీరోయిన్స్ఎక్కువగా దృష్టి పెట్టారని టాలీవుడ్జనం అంటున్నారు. అక్కడి నిర్మాతలు కూడా ఇక్కడి సినిమాలను ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక్కడ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో తీసుకుని వెళ్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఇక్కడి స్టార్ హీరోల సినిమాలను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్స్ఇక్కడి సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడి దర్శకులతో కూడా ఇప్పటికే మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పడం తో భవిష్యత్తులో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు ఆ ఇద్దరు హీరోయిన్లు అని అంటున్నారు.
]]>