Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

కరోనా ఎఫెక్ట్... ప్రజలను భయపెట్టిన 500 రూపాయల నోట్లు...?

$
0
0
దేశంలో కరోనా బాధితుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. కరోనా పేరు వినబడితే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జరిగిన ఒక ఘటన ప్రజలు కరోనాకు ఎంత భయపడుతున్నారో అర్థమవటానికి సాక్ష్యంగా నిలుస్తోంది. బుధవారం రోజు రాత్రి ఉత్తరప్రదేశ్లోని లఖనవూ ప్రాంతంలో రోడ్డుపై కరెన్సీనోటు పడి ఉన్నాయి. సాధారణంగా కరెన్సీనోట్లు కనబడితే ఎవరైనా సరే జేబులో వేసుకుంటారు. 
 
కానీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని వార్తలు వైరల్ కావడం... నిజంగానే నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఆ నోట్లను చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరో కావాలని రోడ్డుపై 500 రూపాయల నోట్లను పడేశారని అనుమానించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లఖనవూలోని పేపర్ మిల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
 
పోలీసులు ఆ నోట్లను తీసుకుని సమీపంలోని వైద్యున్ని కలిశారు. వైద్యుడు 24 గంటల పాటు ఆ నోట్లను నేరుగా తాకవద్దని సూచించారు. మీడియాప్రజలను 500 నోట్ల రూపాయల గురించి పలకరించగా ఎవరో వైరస్ ను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో నోట్లను పడేశారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్అధికారి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని ఒక వీడియో వైరల్ అవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. 
 
ఇప్పటివరకూ ఆ వీడియో విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రోడ్డుపై దొరికిన 500 నోట్లు పోలీసుల దగ్గరే ఉన్నాయని తెలిపారు. మరోవైపు దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఏప్రిల్ 14లోపు పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం కల్పించటం లేదు. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles