కరోనా కు సంబంధించి ప్రజలను మరింత కంగారు పెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్న ఈ పరిస్థితుల్లో మద్యం షాపులు తెరుస్తున్నారు.. ఇదిగో జీవో అంటూ, లాక్ డౌన్ డౌన్ ను ఎత్తివేస్తున్నారు ఇదిగో ఆధారం అంటూ... ఫలానా మతం వారి కారణంగానే ఈ కరోనా వైరస్విజృంభిస్తోంది అని, ఇటీవల తిరుమలశ్రీవారి ఆలయంలో దీపం కొందెక్కిందని, ఎన్నో ఎన్నెన్నో అసత్య కథనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారు. కరోనా వైరస్పై తప్పుడు ప్రచారం చేయవద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత గట్టిగా హెచ్చరికలు చేస్తున్నా ఫేక్ న్యూస్ లు మాత్రం ఆగడం లేదు.
సోషల్ మీడియాలో రకరకాల మార్గాల ద్వారా ఫేక్ న్యూస్ అసలు న్యూస్ కంటే వేగంగా వైరల్ అవుతోంది. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ఇలా అది ఇది తేడా లేకుండా ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. సాక్షాత్తు ప్రధానినరేంద్రమోడీని సైతం వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్కట్టడి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న మన ప్రధానమంత్రిమోదీకి ప్రజలంతా కృతజ్ఞతలు చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దానిలో భాగంగానే ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు, ఐదు నిమిషాల పాటు ప్రజలంతా ఇంటి బాల్కనీలో నిలబడి మోడీకి సెల్యూట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కొంతమంది ఇదే నిజం అనుకుని పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఈ విషయం ప్రధానినరేంద్రమోడి వరకు వెళ్లడంతో ఇందులో నిజం లేదని, ఇదంతా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పని అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేవలం కరోనా విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఇదే రకంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియావాడకం బాగా పెరిగిన తరువాత ప్రతి ఒక్కరూ సమాచారం పంచుకునేందుకు, తెలుసుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటూ ఉండడంతో ఇటువంటి ఫేక్ న్యూస్ లు విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాఅనేది సోషల్ న్యూసెన్స్ గా మారింది అనేది అందరి అభిప్రాయం. ఇప్పుడు సోషల్ మీడియాకాస్తా సోషల్ వైలెన్స్ గా మారి జనాలను ఇబ్బందిపెట్టేవిధంగా మారింది.
]]>