Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

బుడుగు : మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా...!అయితే ఇటువంటి ఆహారాన్ని పిల్లలకు పెట్టండి.. !

$
0
0
తల్లి తండ్రులకు పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కాస్తా పెద్దవాడై స్కూల్‌కు వెళ్లేవరకు ఎలాంటి ఆహారాన్ని అందించాలో అనే ఆలోచన ప్రతి తల్లికి వస్తుంది. అలాంటి వారు కింది విషయాలను తప్పకుండా తెలుసుకోండి. పిల్లలకు అమ్మపాలే అమృతం.ఆరు  నెలలు  నిండాక  కొద్దిగా మినుములు, కొద్దిగా బియ్యం, కొద్దిగా కందిపప్పు,, కొంచెం వాము,  చిటికెడు ఉప్పు, కొన్ని జీడిపప్పులు, బాదాం పప్పులు వేసి  లైట్ గా వేయించి మిక్సర్ లో మెత్తగా పొడిలా చేసుకుని పెట్టుకుని పిల్లలకు పెట్టాలి.దినినే గుజ్జన అన్నం అంటారు.. దీనిలో నెయ్యివేసి పెడితే పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు.


అలాగే ఎదిగే పిల్లలకు అమ్మపాలతో పాటు పాలతో తయారైన ఆహార పదార్థాలు ఇవ్వడం ఆరు నెలల తర్వాత ప్రారంభించాలి. బియ్యం, బార్లీ, గోధుమలు, ఓట్స్‌ వంటివి ఒక సంవత్సరం నుంచి మెల్లమెల్లగా మొదలుపెట్టాలి. పెరిగే పిల్లలకు కొద్దికొద్దిగా కోడిగుడ్డు, చేపలు ఇవ్వడం మొదలెట్టాలి. పాలు, చీజ్‌, పెరుగును తప్పకుండా పిల్లల డైట్‌లో చేర్చాలి. ఇవి పిల్లల్లో ఎముకల బలాన్ని మరింత పెంచుతాయి.




పుట్టిన సంవత్సరం నుంచి పప్పుతో చేసిన వంటకాలు తినిపించవచ్చు. వారానికి రెండు సార్లు చేపలు.. వీలైతే వారానికి ఓసారి మటన్‌ సూప్‌, చికెన్‌ సూప్‌ వంటివి అలవాటు చేయాలి. పండ్లను పంచదార కలపని జ్యూస్‌ రూపంలో, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ఇవ్వాలి..రాత్రిపూట  పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే ఆహారంలాంటివి పెట్టాలి.



ఇలా పిల్లలకు అన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని చిన్నప్పటినుండి పెట్టడం వల్ల పిల్లలు తొందరగా ఎదిగి ఆరోగ్యంగా, దృడంగా ఉంటారు.అలాగే  పిల్లలకు వాడే గిన్నెలు, చెంచాలు రోజూ వేడినీటిలో మరిగించాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టకూడదు. కొద్ది కొద్దిగా పెడుతూ ఉండాలి. చాలామంది తల్లులు పిల్లలకు ఉగ్గు ఒకేసారి కలిపి రోజంతా తినిపిస్తుంటారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తాజాగా కలుపుకోవాలి. 


]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>