Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

ఆసియా కప్ 2020 టోర్నీ పూర్తిగా రద్దు అయినట్టేనా ...?

$
0
0
కరోనా వైరస్.. దీని దెబ్బకి ప్రపంచం మొత్తం విలవిలలాడి పోతుంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో క్రీడా రంగానికి సంబంధించిన అన్ని టోర్నమెంట్ లను నిలిపేశారు. అలాగే మన భారతదేశంలో కూడా ఐపీఎల్ సీజన్ ని వాయిదా వేశారు. అయితే అది తిరిగి జరుపుతారా లేదా అన్న పరిస్థితి నెలకొని ఉంది.


అయితే ఇక అసలు విషయానికి వస్తే.. ఆసియా కప్ 2020టోర్నీ పూర్తిగా రద్దు అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ టోర్నీని నిర్వహించడానికి పాకిస్తాన్హక్కులు కలిగి ఉంది. అయితే ఆ దేశంలో టోర్నీ నిర్వహిస్తే గనుక టీమిండియాని అక్కడికి పంపమని బిసిసిఐఎప్పుడో ప్రకటించింది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్క్రికెట్బోర్డు, బిసిసిఐమాటల యుద్ధానికి దిగి ఎట్టకేలకు కాస్త వెనక్కి తగ్గి uaeవేదికగా టోర్నీని నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. 




దీనికోసమని సెప్టెంబర్లో టోర్నీ నిర్వహించేలా షెడ్యూల్ కూడా ప్రాథమికంగా తయారుచేసి విడుదల చేసింది. అయితే పరిస్థితులు సర్దుకోవడం కష్టంగా ఉండటంతో ఈ టోర్నీ జరగడం సందేహమే అని పాకిస్థాన్క్రికెట్బోర్డు చైర్మన్ ఇషాన్మణి తెలిపారు.



]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles