ఆయన తాజాగా కరోనా వైరస్కారణంగా లాక్ డౌన్ బారిన పడి ఇబ్బందులు పడుతున్న బాలీవుడ్పరిశ్రమసినీ కార్మికులకు గొప్ప మనసు చూపించి సాయం చేస్తున్నాడు. ఒకరు ఇద్దరూ కాదు, మొత్తానికి మొత్తం పాతిక వేల మంది సినీ కార్మికులకు తలా ఓ మూడు వేల రూపాయలు వంతున సల్మాన్ ఖాన్సాయం అందించాడు. ఇది ఒక నెలకు మాత్రమేని. ఇలా ప్రతీ నేలా పాతిక వేల మంది కార్మికుల ఖాతాలో మూడు వేలు వంతున వేస్తూనే ఉంటానని సల్మాన్ ఖాన్ప్రకటించాడు.
నిజంగా ఆయన్ని వేణ్ణోళ్ళ పొగడాలి. కష్టకాలంలో ఆదుకున్న వాడే హీరో. పేరుకు ముందు ట్యాగులు తగిలించుకుంటూ తామే సూపర్ గ్రేటర్ స్టార్లు అనుకునే వారంతా షాక్ తినేలా సల్మాన్ ఖాన్సాయం చేస్తున్నాడు. ఏ ఒక్కరనీ ఆయన దేబిరించలేదు. పేద కళాకారులను ఆదుకుంటాం చందాలివ్వండి అని ఒక్క పైసా చేయి చాచి అడగలేదు అదేదో గొప్ప పదవిలా ఫేల్ అయిలీడర్గా మారిపోలేదు,తానే ఒక నిధిగా, పెన్నిధిగా మారాడు.
ఇక ఆయన వరసలో మరో హీరోఅక్షయ కుమార్మూడు కోట్ల రూపాయలు సినీ కార్మికులను ఆదుకోవడానికి ఇచ్చాడు ఇంతకు ముందే అక్షయకుమార్ పాతిక కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రధానిసహాయార్ధం ఇచ్చాడు. ఇలా బాలీవుడ్లో దిగ్గజాలు స్పందిస్తున్నారు.
మన తెలుగు సీమలో కూడా కోట్లు ఆర్జించే హీరోలు ఉన్నారు. ఎవరికి వారు ఇలా పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తే సినీ కార్మికులే కాదు, తెలుగు రాష్ట్రాల పేదలకు సాయం అంధించినట్లవుతుంది. ఇప్పటికీ మన హీరోలు సాయం చేశారు. కాదనలేము కానీ ఇంకా పెద్ద సాయం చేయగల స్తోమత ఉన్న వారు మన టాలీవుడ్లో ఎందరో ఉన్నారు. వారు కూడా సల్మాన్, అక్షయ్స్పూర్తితో ముందుకు రావాలి. అపుడే అందరూ బాగుంటారు.
]]>