ఇక రాజకీయాల్లో ఉన్న వారికైతే తనవారు పరవారు అన్న తేడా ఉండదు, రాజకీయం చేయడమే వారికి పరమావధి. విశాఖజిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రిచింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఇపుడు కరోనా కొత్త రాజకీయ చిచ్చు రేపుతోంది. మత్తు డాక్టర్సుధాకర్అయ్యన్న సన్నిహితుడని చెప్పింది అయ్యన్న తమ్ముడు, వైసీపీలో చేరిన సన్యాసిపాత్రుడని మాజీ మంత్రిగారి ఆరోపణ.
ఆయన విభీషణుడు. అన్ననైన నాకే వెన్నుపోటు పొడిచాడు. నీవు నమ్ముకుంటే ఇంతే సంగతులు చిత్తగించవలెను అంటూ వైసీపీఎమ్మెల్యేపెట్ల ఉమా గణేష్ ను అయ్యన్న హెచ్చరిస్తున్నాడు. తన తమ్ముడు దారుణమైన మనిషి అంటూ బాంధవ్యాలు మరచి మరీ అయ్యన్న దూషించడం విశేషం.
ఇక తమ్ముడు కూడా ఏ మాత్రం తగ్గలేదు. అయ్యన్న కంటే దారుణమైన వారు ఎవరూ లేరని ఆయన కూడా మీడియాముందుకు వచ్చి భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్చూసిన వారికి రాజకీయాలు ఎంత ఉన్నా దాని కంటే మించినది రక్త సంబంధం కదా, ఇపుడు ఇద్దరు అన్నదమ్ములూ కరోనా రాజకీయం మూలంగా మరింతగా దూరమయ్యారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కరోనా చిచ్చు ఇపుడు మాజీ మంత్రిఇంట రచ్చరేపుతోంది.
నిజానికి అన్నదమ్ములు వేరు వేరు పార్టీలలో ఉండడం ఎప్పటి నుంచో ఉంది. అయినా అనుబంధాలు మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. కానీ అయ్యన్న కుటుంబంలో మాత్రం పోలీసు కేసుల దాకా వెళ్ళడం, మీడియాకు ఎక్కి విమర్శలు చేసుకోవడం దాకా కధ సాగుతోంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
]]>