Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

ఊడిపోవడానికి సిద్ధంగా సి‌ఎం పీఠం !

$
0
0
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకి ముఖ్యమంత్రిగండం వచ్చిపడింది. త్వరలోనే ఉద్దవ్ ఠాక్రేసీఎం పోస్ట్ ఊడిపోవడానికి అవకాశం ఉన్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. మహారాష్ట్రశాసనమండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే ముఖ్యమంత్రిగా ఠాక్రేఎన్నికయ్యారు. కాగా 6 నెలలలోపు ఎమ్మెల్యేగానీ ఎమ్మెల్సీగా గాని  ఈ తరుణంలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. మే 28 నాటికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలలు పూర్తి కానుంది. ఆలోపు ఉద్దవ్ ఠాక్రేఏదో ఒక పదవి నుండి కచ్చితంగా ఎన్నిక కావాలి.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉద్దవ్ ఠాక్రేఎమ్మెల్యేగా ఎన్నికయ్యే చాన్స్ లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న  పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఎవరైనా రాజీనామాచేసిన ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్అనే మహమ్మారి వైరస్ దేశం లో అన్ని రాష్ట్రలో కంటే మహారాష్ట్రలో ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కూడా రెడీగా లేదు. ఇక ఉద్దవ్ ఠాక్రేకి మిగిలి ఉన్న ఆప్షన్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం. అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి గవర్నర్కోటాలో ఎమ్మెల్సీ గా పదవి పొందటం నైతికం కాదని ఉద్దవ్ ఠాక్రేఅనుకుంటున్నారట.



దీంతో ఇటీవల ఉప ముఖ్యమంత్రిఅజిత్పవార్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశానికి కూడా హాజరు కాలేదట. అంతేకాకుండా ఈ సమావేశానికి మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి నవాబ్ మాలిక్స్వయంగా ఉద్దవ్ ఠాక్రేనీ రావొద్దని సూచించారట. మొత్తం మీద ఈ పరిణామంతో ఉద్దవ్ ఠాక్రేసీఎం పోస్టు ఊడిపోవడానికి రెడీగా ఉన్నట్లు మహారాష్ట్రరాజకీయాల నుండి  వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్కట్టడి చేయడంలో సీఎం గా విఫలమైనట్లు అందరూ గుర్తించడంతో ఉద్దవ్ ఠాక్రేసీఎం పోస్టు ఊడిపోవడం గ్యారంటీ అని చాలామంది అంటున్నారు.  

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>