దానికి చంద్రబాబు సిద్ధమేనా అని ఇటీవల మంత్రిమోపిదేవివెంకటరమణ ప్రకటించారు. అయితే ఇదే టైములో మంత్రిఆదిమూలపు సురేష్హైదరాబాద్నగరంలో మీడియాసమావేశం పెట్టడం జరిగింది. తర్వాత సురేష్నేరుగా రాష్ట్రానికి వెళ్లిన క్వారంటైన్లో లేకుండా పర్యటించారు. ఇటువంటి నేపథ్యంలో టిడిపినేతలు ప్రతిపక్ష నేత కి ఒక రూల్… ప్రభుత్వ మంత్రికి మరొక రూలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర పర్యటనకు సిద్ధంగా ఉన్నారని మీరు చేసిన ఛాలెంజ్ కి టిడిపిసిద్ధంగా ఉందని.. ప్రతి సవాలు విసిరారు.
అయితే ముందుగా సురేష్‌ని క్వారంటైన్లో ఉంచాక తర్వాత చంద్రబాబు.. రాష్ట్రంలో పర్యటిస్తారని టీడీపీనేతలు చెప్పుకొచ్చారు. దీనికి వైసిపిసిద్ధమైతే మేము రెడీ, స్టార్ట్ అవుతామని టిడిపినేతలు అంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబుతో పాటు అనేకమంది రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్లు కూడా రాష్ట్రానికి రెడీగా రావడానికి ఉన్నారు అంటూ టిడిపినేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం క్వారంటైన్ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే గౌరవకరంగా ఉంటుందని టిడిపినేతలు సూచిస్తున్నారు. ఇతరులకు ఒక రూల్స్, ప్రత్యర్థులకు మరో రూల్స్ ఇలాంటి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేస్తే ప్రజలే నష్టపోతారు అంటూ వైసీపీకి … టీడీపీనేతలు సూచనలు ఇస్తున్నారు.
]]>