తాజాగా సింగపూర్లో సుమారు 250 మంది భారతీయులు కరోన బారిన పడ్డట్టుగా ఇండియన్హైకమిషన్ వెల్లడించింది. ఈ సంఖ్య అమాంతంగా పెరగడానికి గల కారణాలు అన్వేషించిన హై కమిషన్ అందుకు విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉన్న వారే అత్యధికంగా ఈ కరోన బారిన్ పడ్డట్టుగా తేల్చారు. హై కమిషన్ అధికారి జావేద్ అష్రఫ్ మాట్లాడుతూ. ఈ 250 మంది భారతీయుల్లలో కొందరు సింగపూర్లోనే స్థిరపడిన భారత సంతతి వాళ్ళు కూడా ఉన్నారని తెలిపారు.
కరోన పాజిటివ్ వచ్చిన వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. కాగా వరల్డ్ ఒమీటర్ ఇన్ ఫోన్లో ఇచ్చిన సమాచారం ప్రకారం సింగపూర్లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా సుమారు 2 వేల కేసులు నమోదు అయ్యాయని సుమారు 6 గురు మృతి చెందారని తెలిపారు. సింగపూర్వివిధ కారణాల ద్వార వలస వెళ్ళిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. అక్కడి తాజాగా పరిస్థితులపై ఎప్పటికప్పుడు హై కమిషన్ అలెర్ట్ గా ఉంటోందని బాధితులకి సత్వరసేవలు అందేలా చర్యలు తీసుకుంటోందని అంటున్నారు భారతీయులు..
]]>