Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

అబ్బో.... ఎన్టీఆర్, మహేష్ లతో కాదా ప్రభాస్ తోనా....??

$
0
0
రెండేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ఎందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకున్న కన్నడడబ్బింగ్ సినిమాకెజిఎఫ్చాప్టర్ 1. కన్నడరాక్ స్టార్ యాష్ హీరోగా ఎంతో భారీగా తెరకెక్కిన ఆ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్దర్శకత్వంలో పాన్ ఇండియాఫీల్ తో ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిన ఆ సినిమా, రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా పెద్ద సక్సెస్సాధించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు కొనసాగింపుగా కెజిఎఫ్ చాప్టర్ 2ని తీస్తున్న ప్రశాంత్ నీల్తదుపరి సినిమావిషయమై కొద్దిరోజులుగా మన టాలీవుడ్లో విపరీతంగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. 
 

ముందుగా అప్పట్లో ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్సినిమాఆల్మోస్ట్ ఓకే అయినట్లు వార్తలు కూడా రావడం జరిగింది.వాస్తవానికి ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూ లో ప్రముఖ నిర్మాణ సంస్థైన మైత్రి మూవీమేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక మీడియాఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తమ బ్యానర్ లో ప్రశాంత్ నీల్తో ఒక సినిమాఒప్పందం ఉందని, అయితే ఆ సినిమాని ఎన్టీఆర్గారితో చేస్తారా లేక మరొక స్టార్ హీరోతో చేస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని అన్నారు. ఇక దాని తరువాత ప్రశాంత్టాలీవుడ్సూపర్ స్టార్మహేష్బాబు ని కలిసి ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ వినిపించడం జరిగిందని, ఆ స్టోరీ నచ్చిన మహేష్అతి త్వరలో సినిమాచేద్దాం అని మాటిచ్చారని కూడా వార్తలు వచ్చాయి. 



అయితే దానిపై కూడా ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఇక తాజాగా వినపడుతున్న వార్తలను బట్టి చూస్తుంటే ప్రస్తుతం జాన్సినిమాచేస్తున్న ప్రభాస్, దాని అనంతరం వైజయంతిమూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్దర్శకత్వంలో ఒక సినిమాతో చేయనున్నారు. ఇక వీటి అనంతరం ఆయన ప్రశాంత్ నీల్తో పని చేయనున్నారని, ఈమేరకు ఇటీవల ఒక భారీ నిర్మాణ సంస్థతో ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం ప్రభాస్ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద పండుగవార్తే అని చెప్పవచ్చు.....!!

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>