లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మెడిసిన్ లేని ఈ కరోనాని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ ఒకటే ప్రత్యామ్నాయమని పలు రాష్ట్రాల సీఎంలు అంటున్నారు.
దీంతో కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ పొడిగింపుపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. కాకపోతే లాక్ డౌన్ పొడిగింపు ఖాయమైనా, ఎన్ని రోజులు పొడిగిస్తారో అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే 21 రోజుల నుంచి లాక్ డౌన్ విధించారు. ఇది ఏప్రిల్ 14 తో ముగియనుంది. ఇక ఆ తర్వాత కూడా మరో మూడు వారాలు అంటే మరో 21 రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశముందని కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాటల ద్వారా తెలుస్తోంది.
తాజాగా ఆయన కరోనాపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మరో మూడు వారాల పాటు లాక్ డౌన్ పొడిగిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మోదీకేబినెట్లో కీలకంగా ఉన్న హర్షవర్ధన్ చెప్పిందే జరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రధానిమోదీమరో మూడు వారాల పాటు లాక్ డౌన్ పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రిమాటల ద్వారా అర్ధమవుతుంది. మరి చూడాలి లాక్ డౌన్ పై ప్రధానిఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
]]>