కరోనా వైరస్ వచ్చినా గానీ రాజధానిభూముల విషయంలో అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని బదిలీ చేయించడం విషయంలో వైసీపీఅత్యుత్సాహం చూపిస్తోందని టిడిపినేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఇలాంటి టైములో ప్రజలు ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాలి కానీ రాజకీయాలు చేయటం ఏంటి అని గట్టిగా అడుగుతున్నారు. దీంతో అధికారంలో ఉన్న వైసిపిఅసలు ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడో ఉండి ప్రశ్నించడం ఏంటి అని చంద్రబాబు కి కౌంటర్ లు వేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్కట్టడి చేయడంలో వైయస్ జగన్దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే సంచలన నిర్ణయాలు తీసుకుని కరోనా వైరస్ని కట్టడి చేస్తున్నారని, జాతీయ మీడియాసైతం ఇదే చెబుతుందని అన్నారు.
ప్రజలలో భయభ్రాంతులు కలుగజేయాలని తెలుగుదేశం పార్టీఇష్టానుసారంగా, వ్యవహరించడం చాలా దారుణమని వాళ్ళు చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైసీపీనేతలు పేర్కొంటున్నారు. దీంతో రెండు పార్టీల గొడవ సోషల్ మీడియాలో కూడా రావడంతో...ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతుంటే మీరు మాత్రం రాజకీయాలు మాత్రం ఆపరు అంటూ మండిపడుతున్నారు. ఇటువంటి టైములో కౌంటర్లు ఎన్కౌంటర్లు కాదు మానవత్వం ఉండాలి ప్రతి రాజకీయ నాయకుడికి అంటూ సరికొత్త రాజకీయం సోషల్ మీడియాలో నెటిజెన్ల ఏపీరాజకీయ నేతలకు తెలియజేస్తున్నారు.
]]>