Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 316190

చైనా-డబ్ల్యూహెచ్వో కుమ్మక్కు కావడం వల్లే ప్రపంచమంతా కరోనా..? ఈ చీప్ ట్రిక్స్ చూస్తే అవును అనాల్సిందే..!

$
0
0
ఇప్పటికి ప్రపంచంలో 212 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్కొద్ది నిమిషాల క్రితం విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సరిగ్గా లక్ష మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ప్రపంచమంతా ఈ స్థితికి రావడానికి కారకులు ఎవరు అన్న విషయంపై చర్చ జరగగా అందులో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి మనందరికీ తెలిసిన చైనా కాగా మరొకటి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం అనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన ముద్దాయిగా చైనా తో పాటు బోనులో నిలబడింది.

 


విషయం ఏమిటంటే మొట్టమొదటిసారిగా వుహాన్ లో తన ప్రస్థానం మొదలుపెట్టిన కరోనా గురించి డబ్ల్యూహెచ్ఓ అధిపతిగా ఉన్న ట్రెడోస్ ఈ వైరస్ మానవుల నుండి మానవులకు సంక్రమించదు అని స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇక డబ్ల్యూహెచ్వో ప్రతినిధిగా ఉన్న ఆయన ఏదైనా ముందు వెనకా చూసుకోకుండా మాట్లాడరు కదా అని చాలా దేశాలు చైనాతో ఎటువంటి భయం లేకుండా రవాణా సంబంధాలు కొనసాగించాయి. అయితే కొద్ది రోజుల్లోనే ఈ వైరస్ ప్రపంచమంతా పాకడంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.


 


మరొకవైపు చైనా మాత్రం ముందుగానే మనిషి నుండి మనిషికి ఈ వైరస్ సోకుతుంది అని గమనించి కరోనా పుట్టిన వుహాన్ నగరం నుండి తమ దేశంలోని మిగతా ప్రాంతాలకు సంబంధాలు తెంపేశారు. దీనితో వుహాన్ తప్ప మిగిలిన ప్రాంతాలు పెద్దగా ఈ వైరస్ వల్ల ప్రభావితం కాలేదు, వారు కూడా త్వరగానే కోలుకున్నారు. మరి ట్రెడోస్ అలాంటి ప్రకటన చేసిన తర్వాత పరిస్థితి అర్థం చేసుకున్న చైనా ఎందుకు నోరు మెదపలేదు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక డబ్ల్యూహెచ్వో చేసిన ఈ తతంగం తెలుసుకున్న అమెరికాఅధ్యక్షుడు ట్రంప్నేరుగా వారి పై యుద్ధం ప్రకటించాడు. ట్రెడోస్ చేసిన పాపానికి డబ్బులు ఇచ్చేది లేదని సంచలన ప్రకటన చేశారు.


 


ఇక తాను చేసిన ఈ వ్యాఖ్య వల్ల ఇంతటి పెను ప్రమాదం చోటుచేసుకుంది. అందుకు ట్రెడోస్ తన తప్పును అంగీకరించకపోగా వివాదం నుండి తప్పించుకునేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టాడు. తాను నల్ల జాతికి చెందిన వాడినన్న భావనతోనే అందరూ తనపై పడుతున్నారని ఇది జాతి వివక్ష కిందకే వస్తుందని ఇప్పుడు టెడ్రోస్ ఓ వింత వాదనను వినిపిస్తున్నారు.నల్ల జాతి వాడిని అయినందుకు తాను గర్విస్తున్నానని అయిీతే తన జాతిని ప్రస్తావిస్తూ చాలా మంది తనపై విరుచుకుపడుతూ జావి వివక్షకు పాల్పడుతున్నారని టెడ్రోస్ ఆరోపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కొట్టట్లేదూ..?

]]>

Viewing all articles
Browse latest Browse all 316190

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>