ఇక నిదానంగా ఆర్ధిక వనరులు పెంచుకునే సమయంలో కరోనా మహమ్మారి గట్టి దెబ్బవేసింది. ఊహించని విధంగా కరోనా వైరస్ఎటాక్ చేయడంతో రాష్ట్రం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఆదాయం వచ్చే అన్నిదారులు మూసుకుపోయాయి. అయినా జగన్వెనక్కి తగ్గకుండా ప్రజలకు అండగా ఉంటున్నారు. కరోనా వ్యాప్తి ప్రబలకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం ఆరోగ్య సర్వేచేయిస్తున్నారు. అటు లాక్ డౌన్ వల్ల పేదలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటున్నారు.
ఇప్పటికే ఉచిత రేషన్, రూ. 1000 పేద ప్రజలకు అందించారు. అయితే ఇంకా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించేందుకు చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ మరిన్ని రోజులు పెరిగితే ఏపీఆర్ధిక పరిస్థితి మరింత దారుణంగా తయారై పరిస్థితి నెలకొంది. అయితే ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా, ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా జగన్ముందుకెళుతున్నారు. అయితే ఇలా ఓ వైపు కరోనా వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే మరోవైపు అకాల వర్షాలు మరింత దెబ్బవేశాయి. రైతులు పండించిన పంటలని అకాల వర్షాలు, ఈదురుగాలులు ముంచేసాయి. ర్రాష్ట్రంలో వరి, మామిడితోటలు, మొక్కజొన్న, ఎండుమిర్చి, కూరగాయ పంటలని దారుణంగా నష్టపరిచాయి.
ఇక ఇలా రైతులకు ఒక్కసారిగా ఇబ్బందులు రావడంతో జగన్వెంటనే స్పందించారు. వెంటనే పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులని ఆదేశించారు. అలాగే పిడుగుపాటుకు మరణించిన వారికి 24 గంటల్లోగా ఎక్స్‌గ్రేషియా అందించాలని చెప్పారు. ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా.. జగన్వెంటనే స్పందిస్తూ ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
]]>