Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298096

భారత్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం... అసలు ఏం చేస్తున్నారయ్యా మీరు..?

$
0
0
కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రపంచం కన్ను చైనా తర్వాత భారతదేశం పైనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత జనాభాకలిగిన రెండవ దేశంగా ఉన్న భారత్లో ఈ వైరస్ వ్యాప్తి మొదలైతే ఎంతవరకు ఆగుతుందని ప్రపంచ దేశాలు అని ఆత్రుతగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారతదేశంలో కరోనా వ్యాప్తి సమూహ దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించి 135 కోట్ల మంది భారతీయుల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం మొదటి నుండి ఇటువంటి వార్తలపై అప్రమత్తంగా ఉండి తమ నివేదికలో అటువంటిది ఏమి బయటపడలేదని డబ్ల్యూహెచ్వో వార్తలను తోసిపుచ్చింది.

 


ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్లో వైరస్ వ్యాప్తి ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లెవెల్ అనగా సమూహ వ్యాప్తి అయిన మూడవ దశకు చేరలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారత దేశం సేఫ్ జోన్ లోనే ఉందని... తమ నివేదికలో తప్పు జరిగిందని పేర్కొంది. ఇకపోతే చైనాలో మొదలైన కారోనా ను ఆలస్యంగా గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో అలసత్వం వహించిన ఆరోగ్య సంస్థ ఇంకా తమ తప్పులను పునరావృతం చేస్తూనే ఉంది.


 


ఒకవైపు అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరును తప్పుపడుతున్న తరుణంలోనే ..తప్పు మీద తప్పు చేస్తుంది. డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించిన నివేదికలో భారత్కు సంబంధించిన కాలమ్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అని పేర్కొనగా చైనాలో క్లస్టర్ కేసులు నమోదవుతున్నట్టు తెలిపిందిఅసలు భారత ప్రభుత్వం అప్పటికప్పుడు అప్రమత్తం కాకుండా వారి మాటలనే నమ్మి వుంటే ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చేది. అప్పుడు అనేక ప్రజల జీవితాలు దుర్భరం అయ్యేవి.


 


ఇక ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం 7330 గా కరుణ పాజిటివ్ కేసులు నమోదు కాగా దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు వదిలారు, గత 24 గంటల్లో మరొక 34 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఇటువంటి విపత్కర పరిస్థితుల మధ్య కేంద్రం ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఒడిస్సా మరియు పంజాబ్రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సంబంధం లేకుండా లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.

]]>

Viewing all articles
Browse latest Browse all 298096

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>