దాదాపు ప్రపంచ దేశాలన్నింటినీలోనూ ప్రవేశించిన వైరస్.. ప్రత్యేకించి అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్, చైనా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను ఇంతగా వణికించిన మరో మహమ్మారి ఇటీవలి కాలంలో లేదు. ముందు ముందు ఒక్క అమెరికాలో ఏకంగా లక్ష మంది వరకూ ప్రాణాలు కోల్పోవచ్చని ఏకంగా ఆ దేశ అధ్యక్షుడే ప్రకటిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
శుక్రవారం సాయంత్రానికి ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 16.6 లక్షలు దాటేసింది. ఇప్పటి వరకూ ఈ కరోనా బారిన పడి అత్యధికంగా ఇటలీలో ఎక్కువగా 19 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. ఇటీవలే దాని బారిన పడిన అమెరికాకూడా ఇంచు మించు 18 వేల మందిని పోగొట్టుకుంది. ఈ రెండు దేశాల తర్వాత ఎక్కువగా స్పెయిన్లో ప్రాణ నష్టం సంభవించింది. ఈదేశంలో 16 వేల మంది వరకూ చనిపోయారు.
ఫ్రాన్స్, లండన్, ఇరాన్, బెల్జియం దేశాల్లోనూ వేల సంఖ్యలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మరికి సరైన మందు ఇప్పటి వరకూ కనిపెట్టలేకపోవడం దీని మారణ హోమానికి మరో కారణంగా మారింది. కొన్ని ప్రయోగాలు ఫలిస్తున్నా.. సాధికారమైన మందు వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి అప్పటి వరకూ ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలో అర్థం కాకుండా ఉంది. ఇండియాలోనూ దీని ప్రభావం గణనీయంగా ఉన్నా.. మృతుల సంఖ్యలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగానే ఉంది.
]]>