ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యకి తెలంగాణపోలీసులు సరికొత్త యాప్ ద్వారా బాగా చెక్పెట్టడం జరిగింది. లాక్ డౌన్ ఉల్లంఘన ఏ మాత్రం మీరిన ఈ సరికొత్త యాప్ వ్యక్తి యొక్క వాహనం నెంబర్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆ వ్యక్తి యొక్క పేరు కూడా...ఆ ప్రాంతంలో పోలీసు దగ్గర ఉన్న యాప్ లో డిస్ప్లే చేస్తుంది. అంతేకాకుండా సదరు వ్యక్తి ఎంత దూరం ప్రయాణించారన్న విషయాన్ని జీపీఎస్ ద్వారా సదరు యాప్ సమాచారాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో 3కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్లు తేలితే.. వెంటనే అతడి మీద చర్యలు తీసుకుంటారు.
ఇప్పటికే వందలాది మంది మూడు కి.మీ నిబంధనను ఉల్లంఘిస్తున్నట్లుగా గుర్తించారు. వారందరిపైనా తెలంగాణపోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కచ్చితంగా లాక్ డౌన్ స్ఫూర్తి దెబ్బ తీయకూడదని ఆకతాయిలకు తెలంగాణపోలీసులు సరికొత్త యాప్ తో చెక్పెడుతున్నారు. ఈ యాప్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పోలీసులు ఉపయోగిస్తే ఒక్కడు కూడా బయటకు రాడు అని ఈ యాప్ గురించి చాలామంది అంటున్నారు.
]]>