తెలంగాణలో దాదాపు అందరూ కేసీఆర్పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఏపీలో మాత్రం జగన్పనితీరుపై టీడీపీ, జనసేనతో సహా మిగతా విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెదవి విరుస్తున్నారు. పైగా వీరు సీఎం కేసీఆర్పనితీరుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో ఉండిపోయిన టీడీపీఅధినేత చంద్రబాబు, ఏపీప్రతిపక్ష నేత చంద్రబాబు , కరోనా వ్యాప్తిపై జగన్కు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియాద్వారా, లేఖల ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే, కొన్ని సమస్యలపై జగన్ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇలా బాబు హైదరాబాద్లో ఉండి ప్రశ్నించడాన్ని వైసీపీనేతలు తప్పు బడుతూ, విమర్శలు చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా టీడీపీఉంది కదా, అక్కడ సీఎం కేసీఆర్కు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై తెలుగు తమ్ముళ్ల రీజన్ కూడా గట్టిగానే చెబుతున్నారు. కరోనా వ్యాప్తిపై పోరాటం చేయడంలో, ప్రజల్ని ఆదుకోవడంలో, ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లు పెట్టి, పరిస్థితుల్ని వివరిస్తూ, ప్రజలకు జాగ్రత్త చెప్పడంలో కేసీఆర్అద్భుతంగా పనిచేస్తున్నారని అంటున్నారు. కానీ జగన్అలా చేయడంలో విఫలమయ్యారని, అందుకే చంద్రబాబు...కేసీఆర్ కు సలహాలు ఇవ్వడం కంటే ముందు జగన్కు సలహాలు ఇస్తున్నారని, పైగా ఏపీప్రతిపక్ష నేత కాబట్టి బాధ్యతగా వ్యవహరిస్తున్నారని టీడీపీనేతలు అంటున్నారు.
]]>