మరోవైపు ఎందరో ప్రజలు కూడా ఇళ్ళనుండి బయటకు రాలేక, పనులు లేక, కనీసం తినడానికి పట్టెడన్నం లేక విలవిల లాడుతున్నారు. ఇక ఈ దుర్భర పరిస్థిని ఇప్పటికే గ్రహించిన కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను ఆదుకునేందుకు కొంత మేర ఆర్ధిక ప్యాకెజీ లను అందిస్తున్నాయి. అలానే కొందరు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను తమ వంతుగా ఆదుకోవడం తమ కర్తవ్యం అని ముందుకు వస్తూ తమ శక్తికొలది విరాళాలు అందిస్తున్నారు. మరోవైపు సినిమారంగానికి చెందిన ఎందరో ప్రముఖులు ఇప్పటికే విరాళాలు అందించి తమ గొప్ప మనసు చాటుకోగా, ఇటీవల ఏకంగా కరోనా విపత్తు నిధికి రూ.25 కోట్ల భారీ విరాళం ఇచ్చి ఎంతో గొప్ప ఉదారతను చాటుకున్నారు బాలీవుడ్నటుడు అక్షయ్కుమార్. అయితే ఈ విషయమై తన భార్యట్వింకిల్ ఖన్నాతనతో మాట్లాడుతూ, మీరు అంత భారీమొత్తంలో విరాళం ప్రకటించారు కదా, మనకు డబ్బు అవసరం లేదా అని అడుగగా, నిజానికి తాను నేడు ఇంతటి ఉన్నత స్థాయిలో ఉన్నాను అంటే అది ప్రజల ఆదరణ వల్లనే అని, కావున వారిని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవడం తన ధర్మం అని అన్నట్లు చెప్పారు అక్షయ్.
కాగా అంతటితో ఆగని అక్షయ్, నేడు ముంబైమునిసిపల్ కార్పొరేషన్ కు మరొక రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించడం జరిగింది. చాలామంది ప్రముఖులు ఏదో తమకు వీలైనంత కొంత మొత్తం ఇస్తుంటే, అక్షయ్గారు మాత్రం ఒక్కసారి కాకుండా, ఏకంగా రెండు సార్లు ఇంత భారీ మొత్తాలు ఇవ్వడం చూస్తుంటే నిజంగా ఆయన మామూలోడు కాదని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి చేయాలని కోరుతూ పలువురు ప్రజలు తమ సోషల్ మీడియాఅకౌంట్స్ ద్వారా ఆయనపై పొగడ్తలు కురిపిస్తున్నారు....!!
]]>