కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలోసినీ ఇండస్ట్రీలోని రోజువారీ సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవినేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ని మొదలు పెట్టారు. ఈ ఛారిటీకి ఎందరో విరాళాలను అందిస్తున్నారు. 'ఇప్పటివరకు 6.2 కోట్ల రూపాయలు పైగా విరాళాలు అందాయి...
అయితే,కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా చిరంజీవిపోలీసులను అభినందిన సంగతి తెలిసిందే.. ఈ విషయం పై తాజాగా స్పందించిన డీజీపీ .. 'మీరు కేవలం మాకు మాత్రమే ప్రేరణ కలిగించలేదు... కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించారు. మీ నుంచి స్ఫూర్తిని పొందే ఎంతో మందిని మేల్కొలిపారు' అంటూ డీజీపీ కితాబునిచ్చారు. ఒక పోలీసు కుటుంబం నుంచి వచ్చిన మీ నుంచి వచ్చిన మాటలు... కరోనాపై పోరాటంలో తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పారు. మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తున్నాయని ఆయన తెలిపారు..