Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298109

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ లుక్ ఇంత స్టైలీష్‌గానా...!

$
0
0
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్కాంబినేష‌న్‌లో సినిమాఅన‌గానే ఎన్ని అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ద‌శాబ్ద కాలానికి పైగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాకోసం అటు ఎన్టీఆర్‌, ఇటు త్రివిక్ర‌మ్ అభిమానులు వెయిట్ చేశారు. అయితే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాతో వీరి కాంబినేష‌న్ సెట్ కావ‌డం.. ఆ సినిమాబాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్ అవ్వ‌డం జ‌రిగాయి. వాస్త‌వానికి అర‌వింద స‌మేత అంచ‌నాల‌ను అయితే అందుకోలేదు. అజ్ఞాత‌వాసి లాంటి ప్లాప్ త‌ర్వాత కూడా త్రివిక్ర‌మ్‌ను న‌మ్మి ఎన్టీఆర్ఛాన్స్ ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మే.

 


ఇక ఎన్టీఆర్ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.ఆర్.ఆర్సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాత‌ర్వాత ఎన్టీఆర్త్రివిక్ర‌మ్‌తో సినిమాచేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ ప‌నిచేసిన హీరోల‌తోనే ఎక్కువుగా ప‌ని చేస్తూ ఉంటాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మూడు, బ‌న్నీతో మూడు.. కెరీర్ స్టార్టింగ్‌లోనే మ‌హేష్‌తో రెండు సినిమాలు చేశాడు త్రివిక్ర‌మ్‌. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో రెండో సినిమాచేసేందుకు రెడీ అవుతున్నాడు.  మ‌రి ప్ర‌స్తుతం ఎన్టీఆర్ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాఎప్పుడెప్పుడు వ‌చ్చ‌ద్దా అస‌లు క‌థేంటి. త్రివిక్ర‌మ్ ఎలా చూపించ‌బోతున్నాడు అని ఎదురు చూస్తున్నారు.


 


రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తోన్న ఎన్టీఆర్త్రివిక్ర‌మ్ కోసం ఓ డిఫ‌రెంట్ స్టైలీష్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాతెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. మ‌రి ఎలా ఉండ‌బోతుంది ఏంటి అన్న‌ది తెలియాలి. ఇటీవ‌ల ఎన్టీఆర్సినిమాకు లుక్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాకోసం కూడా త‌న మేకోవ‌ర్‌, బాడీ లాంగ్వేజ్ చాలా మార్చుకుంటాడ‌ట‌. మ‌రి ఇప్పుడు ఎన్టీఆర్లాక్‌డ‌వున్‌లో కూడా ఫుల్ బిజీగా కొత్త క‌థ‌ల‌ను వింటున్నాడ‌ట‌. కాస్త కూడా కాళీ లేకుండా లాక్‌డ‌వున్ కూడా బిజీగానే గ‌డిపేస్తున్నాడు ఎన్టీఆర్‌.

]]>

Viewing all articles
Browse latest Browse all 298109

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>