మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ అంటే.. చిరంజీవిసినిమాపాటలే కనిపిస్తాయి. మెగాస్టార్పాటలకు రామ్చరణ్.. సాయి ధరమ్ తేజ్స్టెప్పులేశారు. ఇక తేజు అయితే.. ఇప్పటి వరకు నాలుగు పాటలను రీమీక్స్ చేశారు.
సాయి ధరమ్ తేజ్కెరీర్ రీమిక్స్ సాంగ్స్ తో మొదలైంది. డెబ్యూ మూవీరేయ్ కోసం దొంగలోని గోలీమార్ సాంగ్ రీమిక్స్ కు స్టెప్పులేశారు. ఆ తర్వాత సుప్రీమ్.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లోని రీమీక్స్ సాంగ్.. సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
తన ప్రతి సినిమాలో రీమిక్స్ కంపల్సరీగా ఉండాలని తేజు పట్టుబట్టలేదు. హైప్ కోసం.. ఓపెనింగ్స్ కోసమే దర్శకులే ఇలా రీమిక్స్ చేస్తే.. గువ్వ గోరింక సాంగ్ ఉన్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్... అందం హిందోళం పాటతో వచ్చిన సుప్రీమ్హిట్ అయ్యాయి. దీంతో ఇదో సెంటిమెంట్ గా భావించిన దర్శకులు రీమిక్స్ కంటిన్యూ చేశారు. అయితే ఇదే సెంటిమెంట్ తో కొండవీటి దొంగలోని చమక్ చమక్ రీమిక్స్ తో వచ్చిన ఇంటెలిజెంట్ మూవీఫ్లాప్ అయింది.
తనకు ఇష్టం లేకపోయినా.. దర్శకుల కోరిక మేరకు రీమిక్సుల్లో నటించాల్సి వచ్చిందని తేజు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి సాంగ్స్ లేకుండానే వచ్చిన చిత్రలహరి.. ప్రతిరోజు పండుగే హిట్ అయింది. ప్రస్తుతం నటిస్తున్న సోలో బతుకే సో బెటర్ లో కూడా రీమిక్స్ సాంగ్ లేదట. మున్ముందు కూడా సాధ్యమైనంత వరకు రీమిక్సులు లేకుండా.. చేయాలన్న ఉద్దేశంతో తేజు ఉన్నాడట. ఒరిజినల్ ప్లేస్ చెడగొట్టడం ఇష్టం లేకనే.. రీమిక్సుల జోలికి తేజు వెళ్లడం లేదట.
]]>