Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305612

పీఎఫ్‌ విత్‌ డ్రాకు డిమాండ్ మామూలుగా లేదుగా..

$
0
0
క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పీఎఫ్ విత్‌డ్రాకు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డుతోంది. ప్ర‌ధానంగా ఉద్యోగి  వ్యక్తిగత ఆదాయంపైలాక్‌డౌన్‌ ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తమ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ అవకాశాన్ని కేంద్రప్ర‌భుత్వం కల్పించిన విషయం తెలిసిందే.   దేశంలోని అన్ని సంస్థల ఉద్యోగులకు పీఎఫ్ డ‌బ్బుల‌ను విత్‌డ్రా అవకాశం ఇచ్చింది. దీంతో ఒక్క‌సారిగా విత్‌డ్రాకు డిమాండ్ పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా గడిచిన‌ 10 రోజుల్లో సుమారు 1.37 లక్షల మంది క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు  ఈపీఎఫ్‌వో సంస్థ‌ శుక్రవారం ప్ర‌క‌టించింది. కేవైసీ వివరాలు నిబంధనల మేరకు ఉన్న వారి అన్ని అప్లికేషన్లను 72 గంటల్లోగా ప్రాసెస్‌ చేస్తున్నామని ఈపీఎఫ్‌వో సంస్థ పేర్కొంది. ఖాతాదారుల‌కు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామ‌ని తెలిపింది.

నిబంధనల ప్రకారం పీఎఫ్ డ‌బ్బుల‌ విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు ఇప్పటి వరకు రూ.279.65 కోట్లు చెల్లించినట్లు ఈపీఎఫ్‌వో ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 14వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఉద్యోగులు డ‌బ్బుల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా కేంద్రప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంది. అందులో భాగంగానే పీఎఫ్ డ‌బ్బుల విత్‌డ్రాకు స‌డ‌లింపును ప్ర‌క‌టించింది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్యోజన  పథకం కింద  ఈపీఎఫ్‌ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు కేంద్రప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. 
 కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై పీఎఫ్ ఖాతాదారులు ఆంద‌నం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ష్ట‌కాలంలో త‌మ‌ను ఆదుకుంటోంద‌ని అంటున్నారు. ఇదిలా ఉండ‌గా..  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,41 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మ‌రోవైపు కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 14 త‌ర్వాత‌ మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉందని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఇప్పటికే లాక్‌డౌన్ త‌మ రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలాఖరు వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305612

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>