Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305612

మోడీకి జగన్ ఎంత క్లోజో.. ఈ దెబ్బతో తేలిపోయిందిగా..?

$
0
0
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి .. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి మధ్య ఉన్న బంధం ఏంటి.. వైసీపీ మోడీకి మిత్రపక్షమూ కాదు.. అలాగని వైరి పక్షమూ కాదు.. ఎన్డీఏలో చేరకపోయినా మోడీసర్కారును బలపరచడంలో వైసీపీఏనాడు వెనుకడగు వేయలేదు. అలాగని ఎన్డీఏలోనూ చేరలేదు. కానీ.. కేంద్రంలో మద్దతు దృష్ట్యా బీజేపీఅగ్రనేతలు వైసీపీని మిత్రపక్షంగానే భావిస్తున్నారు.

 


 


రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం సంగతి పక్కకుపెడితే జగన్మాత్రం కేంద్రం దగ్గర తనకు అవసరమైన రాజకీయ నిర్ణయాలకు మాత్రం ఆమోద ముద్ర వేయించుకుంటూనే ఉన్నాడు. ఇందుకు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ఉద్వాసనే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిమ్మగడ్డ వర్సస్ జగన్మధ్య పంచాయతీఎన్నికల వేళ ఎంత రచ్చజరిగిందో దేశమంతా చూసింది. కరోనా ఇష్యూ ఇంత పెద్దది కాకపోయి ఉంటే.. ఇదే ఇష్యూ పొలిటికల్ సర్కిళ్లో హాట్ టాపిక్ అయ్యేది.


 


 


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి జగన్గెంటేసిన తీరు చూస్తే.. అందుకు కేంద్రం నుంచి ఆమోద ముద్ర ఉందనే చెప్పాలి. ఇలాంటి వివాదాస్పద ఆర్డినెన్సును ఏమాత్రం తటపాయించకుండా గవర్నర్సంతకం పెట్టేశాడంటే.. అందుకు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమై ఉండాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు రాష్ట్రానికి సంబంధించిన విషయమే అయినా వివాదాస్పదం అయినప్పుడు.. గవర్నర్ అంత సులభంగా సంతకం పెట్టే అవకాశాలు ఉండవు.


 


 


అందులోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ద సంస్థ విషయంలో గవర్నర్అంత సాహసం చేసే అవకాశం లేదు. కచ్చితంగా ఢిల్లీపెద్దల నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగానే రమేశ్ కుమార్గెంటివేత జరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానినరేంద్రమోడీకి జగన్ఎంత క్లోజో అని ఏపీరాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగా మరి.

]]>

Viewing all articles
Browse latest Browse all 305612

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>