తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్తొలగింపు వ్యవహారం అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి రాజ్యంగ బద్దమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా తొలగించే అధికారం మాత్రం లేదు. ఎన్నికల వ్యవస్థ స్వేచ్ఛగా పని చేసేందుకు రాజ్యంగం కల్పించిన వెసులుబాటు ఇది. ఆయన్ను తొలగించాలంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన ప్రక్రియ పూర్తి చేయాలి. కేంద్రం పార్లమెంటులో దీన్ని ఆమోదించాలి.
అయితే కరోనా మహమ్మారి ఏపీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో అప్పటికే ప్రారంభమైన పంచాయితీ ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేశ్ కుమార్వాయిదా వేయడం జగన్కు విపరీతమై ఆగ్రహం తెప్పించింది. సీఎం అయిన తర్వాత అప్పటి వరకూ ఒక్క ప్రెస్మీట్ కూడా పెట్టని జగన్.. ఆ రోజు ప్రెస్మీట్ పెట్టి నిమ్మగడ్డ చంద్రబాబు కులం వ్యక్తి.. చంద్రబాబు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడని ఏకిపారేశారు.
నిమ్మగడ్డ నిర్ణయంపై న్యాయపోరాటం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల గడప తొక్కారు. కానీ అక్కడా జగన్కు నిరాశే ఎదురైంది. నిమ్మగడ్డ వాదనే నెగ్గింది. అయినా జగన్ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టలేదు. ఓవైపు కరోనా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా.. జగన్ నిమ్మగడ్డపై ప్రతీకారం విషయంలో మాత్రం రాజీ పడలేదు. పట్టుబట్టి కేంద్రం నుంచి అనుమతి పొంది.. గవర్నర్ సాయంతో నిమ్మగడ్డ పదవీకాలాన్ని తగ్గించేసి ఆ పదవి నుంచి తొలగించేశారు. ఈ మొత్తం వ్యవహారం న్యాయస్థానాల్లో నెగ్గుతుందా లేదా అన్నది జగన్కు అనవసరం. ముందు తాను అనుకున్నది జరిగిపోవాలి. అంతే..మొత్తం మీద నిమ్మగడ్డ ఉద్వాసనతో జగన్మొండివైఖరి మరోసారి రుజువైందనే చెప్పాలి.
]]>