అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ సినిమావచ్చే ఏడాది కూడా అనుకున్న డేట్ కి రిలీజ్ కావడం దాదాపు అసాధ్యమని అంచనా వేస్తున్నారు. ఇలా అంచనా వేయడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జూన్నెలాఖరు లోపు బ్యాలెన్స్ వర్క్ అంటే యాక్షన్ సీక్వెన్స్ మొత్తం కంప్లీట్ చేయలని షెడ్యూల్ వేసుకున్నారట. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా జూన్నెలాఖరు లోపు షూటింగ్స్ తిరిగి మొదలయ్యో అవకాశాలు కనిపించడం లేదు.
వాస్తవంగా టీం అనుకున్న ప్రకారం కరోనా సమస్య లేకపోతే అక్టోబర్లేదా నవంబర్లోపు ఆర్.ఆర్.ఆర్ఫస్ట్ కాపీ రెడీ చేయాలని సన్నాహాలు చేసుకున్నారు. తర్వాత ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ ఇప్పుడు ప్లాన్స్ మొత్తం మారిపోయాయని సమాచారం. ఇక ఈ సినిమావిజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకం. అయితే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ఇప్పుడు పని చేసేలా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమావిజువల్ ఎఫెక్ట్స్ ఇక్కడే కాకుండా ఇతర దేశాలలోను జరపాలి. కాని అది అయ్యోల్లా కనిపించడం లేదు. దాంతో 2021 జనవరి 8 న ఆర్.ఆర్.ఆర్రిలీజ్ అసాధ్యమని అంటున్నారు.
]]>