లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పేద ప్రజలు, వలస కార్మికులకు ప్రభుత్వపరంగా, దాతలను ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటం, అవసరమైన చోట భోజన వసతి కల్పిస్తున్న విషయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి వినోద్ కుమార్తీసుకొచ్చారు. కరోనా వైరస్మరింతగా ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని వినోద్ కుమార్ఉప రాష్ట్రపతికి వివరించారు. లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా వినోద్ కుమార్పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్నియంత్రణ చర్యలు బాగానే ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వినోద్ కుమార్కు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్రావు కరోనా వైరస్నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా వైరస్ను తుదముట్టించే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉప రాష్ట్రపతి సూచించారు.
కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రికె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని చెప్పారు. కరోనా వైరస్సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రికేసీఆర్శుక్రవారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
]]>