Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

నారాయణ గారూ, తప్పదు.... ఇక మీరు నోరు విప్పాల్సిందేనండి.....!!

$
0
0
టాలీవుడ్సూపర్ స్టార్మహేష్బాబు అతి త్వరలో యువదర్శకుడు పరశురామ్పెట్ల దర్శకత్వంలో ఒక సినిమాచేయబోతున్నట్లు ఇప్పటికే కొద్దిరోజులుగా పలు మీడియామాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఒక మంచి కమర్షియల్ స్టోరీ ని మహేష్కి వినిపించిన పరశురామ్, మొత్తానికి ఆయనతో ఆ కథని ఒప్పించి సినిమాచేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. మైత్రి మూవీమేకర్స్ తో పాటు సూపర్ స్టార్సొంత బ్యానర్ అయిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు టాలీవుడ్టాక్. ఇక ఇప్పటికే భరత్అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల వరుస సక్సెస్లతో హ్యాట్రిక్ విజయాలు అందుకుని మంచి ఊపు మీదున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో కూడా మరొక సక్సెస్కొడతారని అంటున్నారు. 

ఇక దీని తరువాత మహేష్చేయబోయే సినిమాల లిస్ట్ కూడా చాలానే ఉందనున్నట్టు సమాచారం. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్దర్శకత్వంలో ఒక సినిమాచేయడానికి సూపర్ స్టార్గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా చెప్తున్నారు. అలానే ఎప్పటినుండో సూపర్ స్టార్ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఎస్ ఎస్ రాజమౌళిసినిమాకూడా రాబోయే ఏడాది ఉండనున్నట్లు టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్సినిమాతో ఎంతో బిజీగా ఉన్న రాజమౌళి, దాని అనంతరం మహేష్తోనే సినిమాచేయనున్నట్లు చెప్తున్నారు. 



తమ కాంబోలో సినిమాఉంటుందని, అయితే అది ఎప్పుడు సెట్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేం అని, అయితే అది మాత్రం దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గారి నిర్మాణంలోనే తప్పనిసరిగా ఉంటుందని సూపర్ స్టార్మహేష్తో పాటు రాజమౌళికూడా ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది. నిజానికి ఈ వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకోసం అటు మహేష్ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి.ఇక రెండు రోజుల నుండి సూపర్ స్టార్ఫ్యాన్స్, నిర్మాతనారాయణ గారు వీలైనంత త్వరలో మహేష్, రాజమౌళిసినిమాగురించి నోరు విప్పాలని, ఇప్పటికే చాలామంది హీరోలు పాన్ ఇండియాసినిమాలవైపు చూస్తున్నారని, కావున ఇకనైనా నారాయణ గారు ఈ సినిమావిషయమై నోరు విప్పితే తమకు ఆనందంగా ఉంటుందని పలువురు మహేష్ఫ్యాన్స్ తమ సోషల్ మీడియాఅకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు....!! 


]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>