షూటింగ్ దశలో ఉన్న తన 152వ సినిమాటైటిల్ ను ‘ఆచార్య’గా తన నోరు జారుడు కారణంగా పబ్లిక్ లో అనౌన్స్ చేసేశాడు. నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాలశివవరకూ ఈ విషయంలో తల పట్టుకున్నారు. ఇప్పుడు సినిమాలో కీలకంగా మారిన ఓ క్యారెక్టర్ విషయాన్ని కూడా రివీల్ చేసేశాడు. చరణ్నటిస్తాడని చెప్తున్న క్యారెక్టర్ వివరాలు కూడా ఆ మధ్య ఓ మీడియాఇంటరాక్షన్ లో చెప్పేశాడు. ఆ క్యారెక్టర్ కు తనకు సంబంధం ఉండదని కీలకమైన పాయింట్ చెప్పేసి సస్పెన్స్ లేకుండా చేసేశాడు. చూస్తుంటే కరోనా క్రైసిస్ గ్యాప్ లో చిరంజీవే మొత్తం కథ చెప్పేసేలా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
వయసు రీత్యా వచ్చిన చాదస్తమా లేక అత్యుత్సాహమా అనే విమర్శలు వస్తున్నాయి. ఏ సీనియర్ హీరో, స్టార్ హీరోకూడా ఇలా నోరు జారి తమ సినిమాల విషయాలను చెప్పుకోరు. క్యూరియాసిటీ మెయింటైన్ చేసి సినిమాపై హైప్ పెంచుకుంటారు. కానీచిరంజీవిఅత్యుత్సాహం తనతో పాటు చరణ్‌కు కూడా చేటు చేస్తోంది. రంగస్థలం, ఆర్ఆర్ఆర్విషయంలో ఇలానే నోరు జారాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. మరి.. చరణ్, కొరటాలకలిసి చిరంజీవిని ఎలా కట్టడి చేస్తారో చూడాల్సిందే.
]]>