ఇక 10 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మరణించారు. 24 గంటల వ్యవధిలో 892 శాంపిళ్లు పరిశీలించగా కేవలం 17 కేసులు పాజిటివ్‌గా, 875 కేసులు నెగిటివ్‌గా తేలినట్లు హెల్త్ బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు. కరోనా బాధితుల నివాస ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పేషెంట్లతో సన్నిహితంగా ఉన్నవారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారు నివసిస్తున్న ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. ఇక తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి 45 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
]]>