దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తొలుత ఏప్రిల్ 14లోపు కరోనా అదుపులోకి వస్తుందని కేంద్రం, ప్రజలు భావించినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రధాని మోదీదేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ప్రధానిమోదీరైతులకు శుభవార్త చెప్పారు. దేశంలోని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రధానమంత్రికిసాన్ సమ్మాన్ నిధిరెండో విడత నగదును అతి త్వరలో జమ చేయనున్నట్టు ప్రకటన చేసింది. ఈరోజు నుంచి రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. గడచిన బడ్జెట్ సమయంలో కేంద్రం రైతుకు అండగా నిలిచేందుకు 6,000 రూపాయల చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్రం మూడు విడతల్లో రైతుల ఖాతాలలో నగదును జమ చేయనున్నట్లు ప్రకటన చేసింది. సంక్రాంతిపండగ సమయంలో రైతుల ఖాతాలలో మొదటి విడత నగదు జమ కాగా ఈరోజు నుంచి రెండో విడత నగదు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా కోట్ల సంఖ్యలో రైతులకు ప్రయోజనం కలగనుంది. కరోనా విపత్తులో భాగంగా కేంద్రం జమ చేస్తున్న నగదును మరే రుణ ఖాతాల్లోకి బ్యాంకులు మళ్లించకుండా కేంద్రం చర్యలు చేపట్టింది.
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం గతంతో పోలిస్తే ముందుగానే నిధులను జమ చేసింది. మరోవైపు ఏపీ, తెలంగాణరాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో నిన్న కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 381కు చేరింది. మరోవైపు తెలంగాణలో కూడా 16 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 487కు చేరింది. ]]>