లాక్ డౌన్ వల్ల ఆహా యాప్ కూడా బాగా డౌన్ లోడ్స్ జరిగాయని ప్రకటించారు. ఆహా కూడా సబ్ స్క్రైబర్స్ లిస్ట్ పెరిగింది. అయితే సిల్వర్ స్క్రీ పై పెద్దగా గుర్తించని సినిమాలు కూడా ఇప్పుడు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. రాజావారు రాణివారు, మధ, హిట్ ఇలాంటి సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల చేత వావ్ అనిపించుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉన్న చిన్న సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
సినిమాహాళ్లు ఇప్పుడప్పుడే తెరచుకుని పరిస్థితి కనబడటం లేదు.. సీరియల్స్ కూడా షూటింగులు ఆపేశారు. కాబట్టి ఈ ఓటిటి హవా ఇంకా కొనసాగేలా ఉంది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఇప్పుడు దుమ్ముదులిపేస్తుంది. మరో 15 రోజులు లాక్ డౌన్ పొడిగించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు అందరు డిజిటల్ స్ట్రీమింగ్ మీద ప్రేక్షకుల ఆసక్తి చూపిస్తున్నారు. మరి పరిస్థితి ఇలానే ఉంటే రిలీజ్ కాబోయే సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటిలో వచ్చే అవకాశం ఉంది. తెలుగులో ఆహా క్లిక్ అవగా.. దిల్రాజు సురేష్బాబు కలిసి ఒక ఓటిటి ప్లాన్ చేస్తున్నారట. మహేష్బాబు కూడా ఓటిటి ఒకటి పెట్టబోతున్నాడని తెలుస్తుంది.
]]>