బంగారం ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయ్.. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్నటికి నిన్న స్వల్పంగా తగ్గాయి. అయితే ఆ తగ్గుదలకు నేడు మళ్లి బ్రేకులు పడ్డాయి. కరోనా వైరస్కారణంగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పటికి పెరుగుతూనే ఉన్నాయి.. నిన్నటికి నిన్న తగ్గినా బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఎంత పెరిగాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
నేడు హైదరాబాద్మార్కెట్లో బంగారం, వెండిధరలు ఇలా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 43,910 రూపాయలకు చేరింది. ఇంకా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 40,150 రూపాయలకు చేరింది.
అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండిధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండిధర 10 రూపాయిల పెరుగుదలతో 41,000 రూపాయిలు పెరిగింది. ఇంకా దేశ రాజధానిఢిల్లీలో కూడా బంగారం, వెండిధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరిగినప్పటికీ.. తగ్గినప్పటికీ ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో కొనడానికి ఎలాంటి అవకాశం లేదు.
]]>