ప్రస్తుతం నానీ రెండు సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమాతర్వాత నానీ నిర్మాతగా రెండు సినిమాలను చెయ్యాలని చూస్తున్నాడు. అందులో ఒకటి రాజ్ తరుణ్‌తో సినిమాచెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని నానీ దాదాపుగా ఓకే చేసినట్టు సమాచారం. నానీ ఈ సినిమాకథ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు సమాచారం. కథ దాదాపుగా ఓకే అయిందని అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం ఈ సినిమావచ్చే ఏడాది మే నుంచి సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమామీద ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
దానికి కారణం ఈ సినిమాలో నానీ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కథ తనకు బాగా నచ్చడం అందులో ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తాను వాయిస్ చెప్పాలని నానీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమామీద రాజ్ తరుణ్కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. రాజ్ తరుణ్ఈ సినిమాతర్వాత బిజీ అవ్వాలని చూస్తున్నాడు. అతని సినిమాలు ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అవుతున్నాయి. దీనితో ఈ సినిమాను ముందుకి తీసుకుని వెళ్లి ప్రచారం కూడా ఎక్కువగా చేసే ఆలోచనలో ఉన్నాడట.
]]>