Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298115

ఆట మొదలు పెట్టిన ట్రంప్..చైనా పై మొదటి ప్రతీకార దెబ్బ...అదుర్స్ కదూ..!!!

$
0
0
కరోనా మహమ్మారి పుట్టిన చైనా లోకంటే అగ్ర రాజ్యం అమెరికాలోనే దీని ప్రభావం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. అమెరికాప్రజలు కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికాఆర్ధిక నగరమైన  న్యూయార్క్ శవాల దిబ్బగా మారిపోయింది. అమెరికాప్రజలు మానసికంగా, ఆర్ధికంగా నష్టపోతున్నారు. చాలామంది ప్రజలకి తిండికూడా దొరకని పరిస్థితి నెలకొంది. చనిపోయిన వారిని కనీసం అంత్య క్రియలకి ఇళ్ళకి కూడా తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు అన్నీ కేవలం చైనా అలసత్వం వలనే జరిగాయని, కావాలనే చైనా ఇతర దేశాలని కరోనా విషయంలో హెచ్చరించలేదని ఆరోపణలు చేస్తున్నాయి.

ట్రంప్ఏకంగా కరోనా బూచిని కావాలంటే చైనా సృష్టించి ఉంటుందని ప్రకటించారు. కానీ ఆ తరువాత ట్రంప్ఎంతో మౌనాన్ని ప్రదర్శించారు. అదును చూసి దెబ్బ కొట్టడం అమెరికాకి అలావాటే అందుకే ట్రంప్చైనా పై తన ఆట మొదలు పెట్టారు మొదటి దెబ్బ కొట్టేశారు. చైనా టెలికం సంస్థని రద్దు చేయాలని అమెరికాఫెడరల్ కమ్యునికేషన్ కమిషన్ కి అమెరికాహోమ్ , రక్షణ, వాణిజ్య శాఖలు సూచించాయి. చైనా టెలికం వల్ల అమెరికాకి పెను ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని తెలిపాయి.



అమెరికాపధకం ప్రకారమే చైనాని టార్గెట్ చేసింది. ఈ టెలికం రద్దు గనుకా జరిగితే అమెరికావ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్ నెట్ సేవలు, మొబైల్ సేవలని కోల్పోతారు. దాంతో ఒక్క సారిగా చైనా ఈ వ్యవస్థలో కుదేలై పోతుంది. అంతేకాదు ఇది మా ప్రతీ కార చర్యలో మొదటి భాగం మాత్రమేనని అమెరికాహెచ్చరికలు ఇచ్చినట్టుగా కూడా అవుతుంది. అలాగే చైనా టెలికం ని నిషేధించాలని అమెరికాన్యాయవ్యవస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. చైనా టెలికం సంస్థ అమెరికాపై నిఘా పెడుతోందని ఆరోపించింది. అయితే ఇది కేవలం సాంపిల్ మాత్రమేనని భవిష్యత్తులో అమెరికాచైనా ఆర్ధిక వ్యవస్థని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేయడంలో వెనకడుగు వేయదని అంటున్నారు నిపుణులు..

]]>

Viewing all articles
Browse latest Browse all 298115

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>