ఇక స్పెయిన్‌లో 16,081 మంది, ఇటలీలో 18,849, జర్మనీలో 2,707, ఫ్రాన్స్‌లో 13,197 మంది, యూకేలో 8,958 మంది, ఇరాన్‌లో 4,232, టర్కీలో 1006, బెల్జియంలో 3,019, స్విట్జర్లాండ్‌లో 1,002, నెదర్లాండ్స్‌లో 2,511, కెనడాలో 569, బ్రెజిల్‌లో 1,068 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బ్రిటన్ ప్రధానమంత్రిబోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లేనని అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రిఇప్పటికే స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు.
యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>