Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298116

కరోనా సమయంలో సంతకాలు పెట్టడానికి తిరస్కరిస్తున్న రాజ్ తరుణ్ ప్రదీప్ !

$
0
0

కరోనా సమస్య రోజురోజుకి పెరిగిపోతూ నిన్న ఒక్కరోజునే 945 కొత్త పాజిటివ్ కేసులు రికార్డ్ అయిన పరిస్థితులలో ఇండియాలో పూర్తిగా ఎప్పటికి లాక్ డౌన్ తొలిగిస్తారో ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో మూతపడిన ధియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితులలో ఇప్పటికే రిలీజ్ కు రెడి అయి ఉన్న చాల సినిమాలకు అమెజాన్నెట్ ఫ్లిక్స్లాంటి ఒటిటి సంస్థలు ఇస్తున్న భారీ ఆఫర్లు ఆ సినిమానిర్మాతలను ఆలోచనలలో పడేస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు అమెజాన్సంస్థ రాజ్ తరుణ్నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రదీప్నటించిన ’30 రోజులలో ప్రేమించడం ఎలా’ సినిమాలని తమ అమెజాన్స్ట్రీమ్ లో ప్రదర్శించడానికి అనుమతులు ఇస్తే భారీ మొత్తంలో డీల్ ఆఫర్ చేసారని వార్తలు వస్తున్నాయి. చిన్న సినిమాలుగా నిర్మింపబడ్డ ఈమూవీలు ఎప్పుడు విడుదల అవుతాయో ఆమూవీ నిర్మాతలకే క్లారిటీ లేని పరిస్థితులలో ఈ సినిమాలను అమెజాన్ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి ఈమూవీ నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది.



అయితే ఈ విషయం ఈమూవీల హీరోలు రాజ్ తరుణ్ప్రదీప్ల వరకు వెళ్ళడంతో వారిద్దరు ఈ సినిమాలకు సంబంధించి ఇవ్వవలసిన రిలీజ్ ఆర్డర్ పై సంతకాలు పెట్టడానికి తిరస్కరించినట్లు లీకులు బయటకు వస్తున్నాయి. తాము ఈ సినిమాల పై భారీ అంచనాలను పెట్టుకున్నామని ఒకసారి అమెజాన్ప్రైమ్ లో ముందుగా విడుదలై జనం అంతా చూసేసిన తరువాత ఈ సినిమాలు ఆ ధియేటర్లలో విడుదల అయినా ఎవరు చూస్తారు అంటూ వారు ఈ విషయమై తమ తీవ్ర అభ్యంతరాలను ఈ మూవీనిర్మాతలకు ఇప్పటికే చెప్పినట్లు టాక్.



ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే లాక్ డౌన్ పరిస్థితులలో ఒటిటి ప్లాట్ ఫామ్స్ కు విపరీతమైన డిమాండ్ పెరగడంతో అమెజాన్సంస్థ నిర్వాహకులు రామ్‘రెడ్’ మూవీని అనుష్క‘నిశ్శబ్దం’ మూవీరైట్స్ తమ అమెజాన్ప్రైమ్ కు ఇస్తే 20 కోట్ల భారీ పారితోషికం ఇస్తాము అంటూ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయంలో ఒప్పందం కుదిరితే ఈరెండు సినిమాలను కూడ ఈలాక్ డౌన్ పిరియడ్ లోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే రామ్అనుష్కలు కూడ ఈ ఆలోచనలకు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు..


]]>

Viewing all articles
Browse latest Browse all 298116

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>