సినిమాషూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతబడిపోయి ఆర్థికంగా బాగా నష్టం మూటగట్టుకుంది. షూటింగులు క్యాన్సిల్ కావడంతో రోజు వారి సినీ వర్కర్ల పరిస్థితి అద్వాన్నంగా తయారు కావడంతో కరోనా క్రైసిస్ చారిటీ పేరు మీద వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీమొత్తం ఒకే పని మీద ఉంది. లాక్డౌన్ మరిన్ని రోజులు పొడిగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు కథలు వినే పనిలో పడ్డారట.
లాక్డౌన్ పూర్తయ్యి, థియేటర్లు తెరుచుకున్నా జనాలు థియేటర్లకి వస్తారన్న గ్యారెంటీ లేదు. అందువల్ల సినిమాలని రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలని ఇలాంటి టైమ్ లో రిలీజ్ చేస్తే తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల లాక్డౌన్ పూర్తయ్యి రెండునెలలు అయితేగానీ రిలీజ్ చేసే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి అప్పటి వరకు చేసే పనేమీ లేదు కాబట్టి, హీరోలు,నిర్మాతలు కొత్త కథ వింటున్నారు.
ఈ టైమ్ లో వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కథలు వినే పనిలో పడ్డారు. ఈ లాక్ డౌన్ సమయాన్ని తమ ఫ్యూఛర్ ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నారు. కొత్తగా దర్శకత్వం చేయాలనుకునేవారు, రచనపై ఆసక్తి ఉన్నవారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. మరి రచయితలు మీ మీ కథల ద్వారా సిధ్ధం కండి.
]]>