కరోనా వైరస్ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం తెలియంది కాదు ఈ వైరస్ మొదట చైనాలోని వూహన్ నగరం లో ఈ వ్యాధి పేరు కరోనా అని నిర్ధారించ బడింది. కరోనా కట్టడికి చైనా తో సహా ఎన్నో దేశాలు తమ దేశాల్లో లాక్ డౌన్ లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రిమోడీగారు భారత ప్రజల ఐక్యతను చాటటానికి దేశం మొత్తం దీపకాంతులతో నింపాలని పిలుపునిచ్చారు కదా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యేరాజాసింగ్ చేసిన ఓ నినాద చైనా ప్రభుత్వానికి కోపం తెప్పించింది.
మోదీపిలుపు మేరకు ఈ నెల 5న ధూల్‌పేటలో రాజాసింగ్ జ్యోతిని వెలిగించారు. బీజేపీఎమ్మెల్యేరాజాసింగ్ దీపాలను వెలిగిస్తూ ' చైనా వైరస్ గో బ్యాక్' అని పలుమార్లు నినాదం పలికాడు. ఈ విషయం భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది . ఇదే అదనుగా మ్మెల్యే రాజాసింగ్ కి ఓ లేఖవ్రాసింది. వైరస్ తమదేశంలో ముందుగా నిర్ధారణ అయ్యింది అంతమాత్రాన కరోనా మాదేశంలోనే పుట్టిందని దానిని చైనా వైరస్ అని చెప్పడం అవివేకం అని ఆ లేఖలో పేర్కొంది చైనా.
]]>