Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298116

ప్రజలను భయపెట్టిన రూ.500 నోట్లు.. ఇంతకు ఏం జరిగిందంటే... ?

$
0
0
ఇప్పుడు లోకంలో మనుషులు ఒక్క కరోనాకే కాదు.. ప్రతి విషయానికి బెదిరిపోతున్నారు.. ఎందుకంటే కరోనా అనే వైరస్ ఒక్క చోట లేదుకదా, తినే పదర్ధాలతో పాటుగా, వాడే వస్తువుల వరకు అది ఆక్రమించుకుని ఉంది.. అందుకే ఏ దార్లో ఈ వైరస్ వ్యాపిస్తుందో తెలియక అన్ని విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.. కరోనా దెబ్బకు ప్రతివారికి శుభ్రత అలవాటు అయ్యింది.. ఇక ఇప్పుడు రోడ్ల మీద ఉచితంగా ఎంత విలువైన వస్తువులు గానీ, డబ్బులు గానీ దొరికిన తీసుకోవడానికి భయపడుతున్నారు.. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తాగే కొందరిలో కూడా కరోనా మార్పును తీసుకువచ్చింది.. అందుకు ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనే..


ఇకపోతే ఎక్కడైనా డబ్బులు దొరికాయనుకో లటుక్కున తీసుకుని, చటుక్కున జేబులో వేసుకుంటారు కదా.. కానీ లఖ్‌నవూలో మాత్రం అలా జరగలేదు. రోడ్డుపై పడి ఉన్న రెండు రూ.500 నోట్లను తీసుకునేందుకు స్థానికులు ముందుకు రాలేదు సరికదా.. భయంతో దూరంగా జరిగారు కూడా. దీనికి కారణం ఏంటో తెలుసా.. కరోనావైరస్‌ ఒక్క సారి అంటుకుంటే చావుకు దగ్గరగా తీసుకెళ్లుతుందనే భయం. అందుకే ఎవరు వాటిని తీసుకోవడానికి సాహసించలేదు.. లఖ్‌నవూలోని పేపర్‌ మిల్ కాలనీలో, గురువారం రాత్రి ఆ కాలనీ వాసులు తాము వెళ్లే దారిలో రెండు రూ.500 నోట్లు పడి ఉండటాన్ని గమనించారు. వాటిని తీసుకోకపోగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు.




వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. దగ్గర్లోని వైద్యుడి వద్దకు వెళ్లి విషయం వివరించగా.. 24 గంటల పాటు వాటిని ముట్టుకోకుండా వేరుగా ఉంచాలని ఆ డాక్టర్సూచించారట.. ప్రస్తుతం ఇప్పటికీ ఆ రూ.500 నోట్లు పోలీసుల వద్దే ఉన్నాయి... చూశారా మనది కాని వస్తువును మనం తీసుకోవడానికి బయపడే స్దాయికి తెచ్చింది కరోనా.. అసలు ఇప్పుడే కాదు ఎప్పుడైనా మనిషి ఇలాగే జీవిస్తే లోకంలో అవినీతి తగ్గుతుంది.. కానీ మనుషులు మారరు కదా.. ఈ కరోనా తగ్గినాక రోడ్డుమీద రూపాయి దొరికినా వదలరు.. 

]]>

Viewing all articles
Browse latest Browse all 298116

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>