అది ఏంటి అంటే? యాచకులు, నిరాశ్రయులపై విజయవాడమున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. విజయవాడలో ఉన్న యాచకులు, నిరాశ్రయుల కోసం రోడ్లపై వెతుకుతున్నారు. అయితే దీనికి కారణం ఒకటి ఉంది. అది ఏంటి అంటే.. లాక్ డౌన్ సమయం నుండి ప్రజలు ఎవరు కూడా బయటకు రావడం లేదు.
దీంతో రోడ్లపైన బతికే యాచకులకు ఒక్క పూటా భోజనం దొరకడం కూడా గగనం అయిపోయింది. ఇంకా ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, మానవతావాదులు రోడ్లపైకి వచ్చి యాచకులు, నిరాశ్రయులకు ఆహారం పంపిణి చేస్తున్నారు. అయితే దీని వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
దీంతో అధికారులు అప్రమత్తమై రోడ్లపై యాచకులు కనిపిస్తే వారిని వెంటనే షెల్టర్లకు ఏర్పాటు చెయ్యాలి అని నిర్ణయించారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 5 బస్సుల ద్వారా 250 మందికి పైగా యాచకులను షెల్టర్లకు తరలించారు. ఏమైతేనేం.. యాచకులకు, నిరాశ్రయాలకు ఆకలి బాధ లేకుండా చేస్తున్నారు.
]]>