Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298116

భారత్ లో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1035 కొత్త కేసులు, 40 మరణాలు..!

$
0
0
తబ్లీగి జమాత్ మతపరమైన ప్రార్థనలో హాజరైన వారి వలన భారతదేశంలో కరోనా వైరస్పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతిరోజు 500 నుండి 1000 పై చిలుకు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయంటే అతి త్వరలోనే మన ఇండియాలో కూడా కరోనా తీవ్రత యూరప్దేశాల్లో లాగా మారిపోతుందని తెలుస్తోంది. తాజాగా కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 1035 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 40 మంది కరోనా దెబ్బకి ఆహుతయ్యారు. కేవలం ఒక్క రోజే 1035 కేసులు నమోదు కావడం భారత దేశంలో ఇదే మొదటిసారి. ఈ కొత్త కేసులతో ఇప్పటివరకు భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 7447 కి పెరగగా... వాటిలో 6565 ఆక్టివ్ కేసులు ఉండగా... 643 రికవరీ కేసులు, 239 మరణాలు ఉన్నాయి.


కరోనా వైరస్ కారణంగా ఎక్కువ మంది చనిపోయిన దేశాల జాబితాలో భారతదేశం కూడా ఓ స్థానాన్ని సంపాదించబోయే రోజులు తొందర్లోనే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఇటలీ, అమెరికాదేశాల్లో దాదాపు 19 వేల మంది కరోనా వైరస్కారణంగా మృత్యువాత పడగా... స్పెయిన్, ఫ్రాన్స్దేశాలలో పదివేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. యునైటెడ్ కింగ్డమ్లో కూడా 9 వేల మంది కరోనా దెబ్బకి మరణించారు. గతంలో కార్చిచ్చు కారణంగా లక్షలాది జీవ రాశులు మరణించడం తో పాటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లాంటి దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఆస్ట్రేలియా... ఇప్పుడు కరోనా రూపంలో మరో విపత్తుని ఎదుర్కొంటుంది.


మన భారతదేశం కరోనా వైరస్విజృంభిస్తే తట్టుకోగల శక్తిగానీ... అలాగని నెలల పాటు లాక్ డౌన్ పాటించే ఆర్థిక స్తోమత కానీ లేదని నిపుణులు తేల్చి చెప్తున్నారు. కేవలం లాక్ డౌన్ మాత్రమే కాకుండా... సమర్థవంతమైన చర్యలను తీసుకొని ఆర్థిక వ్యవస్థను ఒకవైపు నాశనం కాకుండా చూసుకోవడం... మరోవైపు కరోనా వ్యాప్తిని నియంత్రణ చేయడం ప్రస్తుతం భారత దేశానికి పెద్ద సవాల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రధానినరేంద్ర మోడీఏం మాట్లాడతారో అన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ]]>

Viewing all articles
Browse latest Browse all 298116

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>