అయితే.. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీఅన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్‌డౌన్ కొనసాగించాలా..? వద్దా..? అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రుల అభిప్రాయాల మేరకు ప్రధాని మోడీలాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా ప్రభావం లేని సుమారు 400 జిల్లాల్లో పాక్షికంగా లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. సామాజిక దూరం, స్వీయనియంత్రణ పాటించడం వల్లే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చుననే విషయాన్ని ఇప్పటికే ప్రజల్లోకి ప్రభుత్వాలు బలంగా తీసుకెళ్లాయి. మరోవైపు కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా.. ఒడిశా, పంజాబ్తదితర రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
]]>