కాగా, నేడు నమోదైన ఐదు కేసుల్లో బాధితులందరూ ఢిల్లీమర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారి బంధువులేనని కలెక్టర్వీరపాండ్యన్ తెలిపారు. ఈ లెక్కన కర్నూలు డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయిందా అనే ఆందోళన కలుగుతోంది. ఒకరు మృతి చెందడంతో ప్రతిఒక్కరూ మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారి వల్లనే ఈ కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని తెలుగు రాష్ట్రాల సీఎంలు అంటున్నారు.
అయితే మరికొంత మంది ఇంకా వెలుగు లోకి రాకపోవడం.. వారు స్వచ్చందంగా ట్రీట్ మెంట్ చేయించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 386కి చేరింది. ఇప్పటి వరకు పది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 365 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత 58 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>