దీంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఏం చదవాలో..? ఎవరిని అడగాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఎందుకంటే.. ఇకపై ఇంట్లోనే ఉండి పాఠాలు నేర్చుకోవచ్చు. తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రసారం చేయనుంది తెలంగాణరాష్ట్ర విద్యా శాఖ. దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌లో 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రసారం కానున్నాయి. ఏప్రిల్ 12న ఈ క్లాసులు స్టాట్ అవుతాయి.
ఇప్పటికే ఏపీలో టెన్త్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో సైతం 10వ తరగతి విద్యార్థులకు శుభ వార్త అందించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 10వ తరగతి సబ్జెక్ట్‌లకు సంబంధించిన క్లాసులు ప్రసారమౌతాయి. కాబట్టి.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధం అవ్వండి.
]]>